భారత్ మరియు ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డేలో ఆదివాసీ తెగలకు నివాళి
By: chandrasekar Fri, 27 Nov 2020 10:29 PM
ఈ రోజు క్రికెటర్లు
నివాళి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆస్ట్రేలియా మరియు ఇండియా క్రికెటర్లు
ఆస్ట్రేలియా ఆదివాసీ తెగలకు నివాళి అర్పించారు. ఆస్ట్రేలియా ఆదిమ జాతులకు మనమందరం
ఒకే నేలకు చెందినవాళ్లమని ఈ సందేశాన్ని క్రికెటర్లు వినిపించారు. సిడ్నీలో
ఇవాళ భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే ఆరంభమైంది. ఈ నేపథ్యంలో
మ్యాచ్ ప్రారంభానికి ముందు రెండు జట్ల ప్లేయర్లు బేర్‌ఫూట్ సర్కిల్‌తో నివాళి
అర్పించారు.
ఇరు దేశాల క్రికెటర్లు
పాదరక్షలు ధరించకుండానే ఆదిమ తెగ ప్రజలకు తమ గౌరవాన్ని వ్యక్తం చేశారు.
ఆసీస్ నేలకు, స్థానిక తెగలకు, దేశానికి గౌరవం ఇవ్వాలన్న సందేశాన్ని క్రికెటర్లు
వినిపించారు. ఆసీస్, ఇండియా
క్రికెటర్లు స్టేడియంలో మధ్యలో ఉత్త కాళ్లతో నిలబడి బేర్‌ఫూట్ సర్కిల్
నివాళి అర్పించారు. ఆస్ట్రేలియాలో ఆదిమ తెగలు సుమారు 65 వేల
ఏళ్ల క్రితం నుంచి ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి.
ఈ నివాళిలో ఈ దేశాన్ని
సుసంపన్నం చేసినవారందరికీ గౌరవం తెలుపుతున్నట్లుగా క్రికెటర్లు నివాళి కార్యక్రమంలో
పాల్గొన్నారు. సాంప్రదాయంగా ఆ ప్రాంతానికి చెందిన వారిని మర్యాదపూర్వకంగా
గుర్తించేందుకు క్రికెట్ ఆటగాళ్లు బేర్‌ఫూట్ సర్కిల్‌ను నిర్వహిస్తుంటారు. మనమందరం
ఒకే నేలకు చెందినవాళ్లమని, అందరమూ మనుషులమే అని, కలిసికట్టుగా
ఉండాలన్న సంకేతాన్ని ఈ నివాళితో చాటనున్నారు. జాతి వివక్షకు వ్యతిరేకంగా కూడా
ఇలాంటి కార్యక్రమాలను ఆస్ట్రేలియాలో నిర్వహిస్తూ ఉంటారు.