Advertisement

  • ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో శిక్ష‌ణ విమానం కూలి పైల‌ట్‌ మృతి

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో శిక్ష‌ణ విమానం కూలి పైల‌ట్‌ మృతి

By: chandrasekar Tue, 22 Sept 2020 11:53 AM

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో శిక్ష‌ణ విమానం కూలి పైల‌ట్‌ మృతి


ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఓ శిక్ష‌ణ విమానం కూలిపోయింది. ఈ ప్ర‌మాదంలో పైల‌ట్ మ‌ర‌ణించాడు. ఇద్ద‌రు క్షేమంగా బ‌య‌ట‌పడ‌గా, మ‌రొక‌రు త‌ప్పిపోయారు.

అజ‌మ్‌గ‌ఢ్ జిల్లాలోని కుశ్వాపుర‌వా గ్రామంలో సోమవారం ఉద‌యం 11.20 గంట‌ల‌కు శిక్ష‌ణ విమానం కూలిపోయింది. దీంతో అది పూర్తిగా ధ్వంసమ‌య్యింది.

ప్ర‌మాద సమ‌యంలో అందులో న‌లుగురు ఉన్నార‌ని, ఒక‌రు మ‌ర‌ణించ‌గా, మ‌రో ఇద్ద‌రు ప్యారాచుట్ స‌హాయంతో కిందికి దిగార‌ని పోలీసులు చెప్పారు. మ‌రొక‌రి జాడ తెలియ‌డం లేద‌ని తెలిపారు. గ్రామ‌స్థుల స‌హాయంతో శిథిలాల నుంచి మృత‌దేహాన్ని వెళికి తీశామ‌ని పేర్కొన్నారు. త‌ప్పిపోయిన వ్య‌క్తికోసం వెదుకుతున్నామ‌ని తెలిపారు.

Tags :
|

Advertisement