నిజాయితీగా చెబుతున్నా.. చాన్సే లేదు: స్టీవ్ స్మిత్
By: chandrasekar Sat, 31 Oct 2020 1:29 PM
ఆస్ట్రేలియా క్రికెటర్
స్టీవ్ స్మిత్ మరికొంత కాలం బయో బబుల్‌లో ఉండేందుకు ఇష్టపడని కారణంగా ఈ ఏడాది
బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్) నుంచి తప్పుకున్నాడు.
ఆగస్టు నుంచి బయో
సెక్యూర్ వాతావరణంలో ఉంటున్న స్మిత్‌తో పాటు వార్నర్, కమిన్స్
కూడా ఇదే నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దీనిపై ఓ ఇంటర్వ్యూలో
స్పందించిన స్మిత్ ‘నిజాయితీగా చెబుతున్నా.. చాన్సే లేదు’ అని చెప్పాడు.
ఈ ఏడాది చివర్లో టీమ్‌ఇండియా..
ఆసీస్‌లో పర్యటించనుండగా.. దాదాపు అదే సమయం (డిసెంబర్ 3 నుంచి
2021
ఫిబ్రవరి 6 వరకు)లో బీబీఎల్ పదో సీజన్ జరుగనుంది. దీంతో
అంతర్జాతీయ స్టార్లు లీగ్‌కు దూరమయ్యే చాన్స్‌లు ఉన్నాయి.
Tags :
bbl |