కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులు మరో ఘాతుక౦...బీజేపి కార్యకర్తల కాల్పులు.. ముగ్గురు మృతి
By: chandrasekar Fri, 30 Oct 2020 2:09 PM
జమ్ముకశ్మీర్‌లోని
కుల్గాం జిల్లాలో బీజేపి కార్యకర్తలపై
ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు బీజేపీ కార్యకర్తలు మృతిచెందినట్లు కుల్గాం జిల్లా పోలీసులు
స్పష్టంచేశారు. ఖాజీగుండ్ ప్రాంతంలో ఈ ఉగ్రదాడి జరిగిందని కేసు నమోదు చేసుకుని
దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.
గురువారం రాత్రి 8.20
గంటలకు వైకే పోరా గ్రామంలో ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడినట్టుగా తమకు సమాచారం
అందిందని పోలీసులు తెలిపారు. ఉగ్రవాదుల కాల్పుల్లో గాయపడిన ముగ్గురిని చికిత్స
నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఫిదా హుస్సేన్ అనే యువకుడు
మృతి చెందగా మరో ఇద్దరు చికిత్స పొందుతూ మృతి చెందారని పోలీసులు పేర్కొన్నారు.
మృతులను వైకే పోరా
నివాసి అయిన బీజేపీ జిల్లా యువజన ప్రధాన కార్యదర్శి గులాం అహ్మద్ యాటూ కుమారుడు
ఫిదా హుస్సేన్ యాటూ, సోఫర్ దేవ్‌సర్ నివాసి అబ్దుల్ రషీద్ బేగ్ కుమారుడు
ఉమర్ రషీద్ బేగ్, వైకె పోరా నివాసి మొహద్ రంజాన్ కుమారుడు ఉమర్ రంజాన్
హజామ్‌గా పోలీసులు గుర్తించారు. బీజేపి కార్యకర్తలపై ఉగ్రవాదుల కాల్పుల ఘటన అనంతరం
పోలీసులు, భద్రతా
బలగాలు వైకె పొరా ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం క్షుణ్ణంగా గాలింపు చేపట్టారు.