కళ్ళులేని వారు బయోనిక్ ఐ వల్ల ఇకపై చూడగలరు
By: chandrasekar Fri, 18 Sept 2020 3:05 PM
కంటి చూపు లేని జీవితం
ఎంత కష్టమో ఊహక౦దని విషయం. అలాంటి వారి కోసం ప్రపంచవ్యాప్తంగా పరిశోధకులు రకరకాల
బయోనిక్ సొల్యూషన్స్ ద్వారా ఏమైనా క్యూర్ ఉంటుందా అని ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇంత వరకూ ఎవరూ పూర్తిగా సక్సెస్ అవలేదు కానీ, ఒక ప్రయోగాలు మాత్రం విజయం సాధించే అవకాశాలు
కనిపిస్తున్నాయి. ఆస్ట్రేలియా లోని మెల్బోర్న్ లో ఉన్న మొనాష్ యూర్నివర్సిటీ లో
పరిశోధకులు ఒక బయోనిక్ ఐ ని డెవలప్ చేశారు. ఒక బ్రెయిన్ ఇంప్లాంట్ ద్వారా ఈ
బయోనిక్ ఐ వల్ల విజన్ వస్తుంది. ప్రపంచంలోనే ఇది మొట్టమొదటి బయోనిక్ ఐ అని
రీసెర్చర్స్ అంటున్నారు. ఈ బయోనిక్ ఐ మీద సుమారుగా పదేళ్ళ నుండీ రీసెర్చ్
చేస్తున్నారు. ఇందులో డ్యామేజ్ అయిన ఆప్టిక్ నెర్వ్స్ ని బైపాస్ చేసి సిగ్నల్స్
రెటీనా నుండి బ్రెయిన్ లో ఉన్న విజన్ సెంటర్ కి చేరుకుంటాయి. ఈ సిస్టం కూడా చాలా
సింపుల్ గా ఉంది. వ్యక్తులు ప్రత్యేకంగా తయారు చేసిన ఒక హెడ్ గేర్ ని ధరిస్తారు.
ఇందులో ఒక కెమేరా, ఒక
వైర్లెస్ ట్రాన్స్మిటర్ ఇన్స్ స్టాల్ అయి
ఉంటాయి. ఈ రిసీవర్ నుండి బ్రెయిన్ లో ఇంప్లాంట్ చేసిన టైల్స్ సిగ్నల్స్ ని
అందుకుంటాయి. ఇది వాడే వ్యక్తులకి ఇంటి లోపలా, బయటా తేడా తెలుస్తుంది. వారి చుట్టూ వ్యక్తులూ, వస్తువులూ
ఉన్నాయని తెలుస్తుంది అని పరిశోధకులు చెబుతున్నారు. ఈ ఎక్స్పెరిమెంట్ గొర్రెల మీద
చేస్తే సక్సెస్ అయ్యింది. అందుకని వారిప్పుడు హ్యూమన్ క్లినికల్ ట్రయల్
చేయనున్నారు. ఈ క్లినికల్ ట్రయల్ కూడా మెల్బోర్న్ లోనే జరుగుతుందని ఎక్స్పెక్ట్
చేస్తున్నారు. ఈ సిస్టం ని ఇంకా మెరుగు పరిచి ట్రీట్మెంట్ లేని న్యూరలాజికల్
కండిషన్స్ తో సఫర్ అవుతున్న వారికి హెల్ప్ చేసే దిశగా పరిశోధకులు ఆలోచిస్తున్నారు.
లింబ్ పెరాలసిస్, క్వాడ్రుప్లీజియా వంటి సమస్యలు ఉన్న వారికి ఈ సిస్టం
ఎంతో హెల్ప్ చేస్తుంది.