బిగ్ బాస్ చరిత్రలోనే అత్యధిక ఓట్లు నమోదైన సీజన్ ఇదే...
By: chandrasekar Mon, 07 Dec 2020 4:35 PM
బిగ్ బాస్ సీజన్ 4 మరో
రెండు వారాలు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ఎవరు విన్నర్, ఎవరు
రన్నర అనే దానిపై సోషల్ మీడియాలో చర్చ మొదలయింది. ఇక బిగ్‌బాస్ చరిత్రలోనే
తొలిసారిగా పది కోట్ల ఐదు లక్షల ఓట్లు వచ్చాయని వ్యాఖ్యాత నాగార్జున
పేర్కొన్నారు. ఈ గణాంకాలు చూస్తుంటే ఈ షోకు ఆదరణ మరింత పెరుగుతూ ఉంది. ఇక ఇన్ని
రోజులు రాత్రి 9.30ని.లకు ప్రసారమైన ఈ షో నేటి నుండి 10 గంటలకు
ప్రసారం కానుంది. శని, ఆదివారాలలో మాత్రం 9గంటలకు ప్రసారం అవుతుంది.
సండే ఫన్ డే. నాగార్జున
ఇంటి సభ్యులతో కలిసి చేసే సందడి ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఆదివారం రోజు హౌజ్‌మేట్స్‌తో యారోంకో యార్ అనే గేమ్ ఆడించారు. అంటే ఒకరి గురించి
ఒకరికి ఎంత తెలుసు అనేది కన్నుక్కోవడం. ఇందులో భాగంగా ఒక హౌజ్‌మేట్‌ను నాగ్ ప్రశ్న
అడగగా, ఆయన సమాధానానికి
మిగతా హౌజ్‌మేట్స్ సమాధానానికి పొంతన కుదురుతుందా అని చూస్తారు. కరెక్ట్ ఉంటే
ఓ రోజా పువ్వు ఇస్తారు. ఎక్కువ రోజా పూలు అందుకున్న వారు 'అందరి బంధువయ' సాష్‌ను అందుకుంటారు. ఈ గేమ్‌లో సోహైల్ విజేతగా నిలవగా
రన్నరప్‌గా హారిక నిలిచింది.