రసవత్తరంగా సాగిన ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డే
By: chandrasekar Thu, 17 Sept 2020 5:51 PM
ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా
మధ్య ఆఖరిదైన మూడో వన్డే రసవత్తరంగా సాగింది.
ఆసీస్ పేస్ బౌలర్ మిచెల్
స్టార్క్ తన సత్తా ఏంటో చూపించి వారెవ్వా
అనిపించాడు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేస్తున్న ఆతిథ్య ఇంగ్లాండ్‌కు
షాకిచ్చాడు. కొత్త బంతితో బుల్లెట్ లాంటి బంతులతో విరుచుకుపడుతున్నాడు.
ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసేందుకు బంతిని అందుకున్న స్టార్క్ .మొదటి బంతికి
ప్రమాదకర జేసన్ రాయ్ పెవిలియన్ దారి పట్టాడు.
ఆ తర్వాతి బంతికే అప్పుడే
క్రీజులోకి వచ్చిన జో రూట్‌ను ఔట్ చేసి ఇంగ్లాండ్‌ను దెబ్బకొట్టాడు. దీంతో
ఇంగ్లాండ్ కనీసం పరుగుల ఖాతా తెరువకుండానే రెండు కీలక వికెట్లు చేజార్చుకున్నది. 4
ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ 13
పరుగులు చేసింది. మరో ఓపెనర్ జానీ బెయిర్‌స్టోతో కలిసి కెప్టెన్ ఇయాన్ ఇన్నింగ్స్‌ను
చక్కదిద్దే ప్రయత్నం చేసాడు. ఓపెనర్
బెయిర్‌స్టో మెరుపు సెంచరీతో చెలరేగడంతో పాటు శామ్ బిల్లింగ్స్ అర్ధశతకంతో
రాణించడంతో ఇంగ్లాండ్ నిర్ణీత ఓవర్లలో 7
వికెట్లకు 302 పరుగులు చేసింది.