ఒక్క గెలుపు కూడా లేకుండా న్యూజిలాండ్ పర్యటనని ముగించిన వెస్టిండీస్...
By: chandrasekar Mon, 14 Dec 2020 4:43 PM
వెల్లింగ్టన్ వేదికగా
జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో వెస్టిండీస్‌ని ఇన్నింగ్స్ 12
పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఓడించి౦ది. తొలుత మూడు టీ20ల
సిరీస్‌ని 0-2తో బాటు వెస్టిండీస్ రెండు టెస్టుల సిరీస్‌లోనూ 0-2తో
తేడాతో ఓడిపోయారు.
రెండో టెస్టు మ్యాచ్‌లో
టాస్ గెలిచిన వెస్టిండీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్
జట్టు హెన్రీ నికోలస్ (174: 280 బంతుల్లో 21x4,
1x6) భారీ శతకం బాదాడు. నికోలస్‌తో పాటు ఆఖర్లో నైల్
వాగ్నర్ (66 నాటౌట్: 42 బంతుల్లో 8x4,
4x6) హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 460
పరుగులు చేసింది. తరువాత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 131
పరుగులకే ఆలౌటైంది.
వెస్టిండీస్ జట్టులో
బ్లాక్‌వుడ్ (69: 92 బంతుల్లో 11x4)
టాప్ స్కోరర్‌కాగా టిమ్ సౌథీ, జెమీషన్
ఐదేసి వికెట్లు తీశారు. దాంతో 329 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని అందుకున్న
న్యూజీలాండ్ వెస్టిండీస్ చేత ఫాలో ఆన్
ఆడించింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్‌లు సమష్టిగా
రాణించడంలో విఫలమయ్యారు.
ఓపెనర్ క్యాంప్‌బెల్ (69: 109 బంతుల్లో), జేసన్ హోల్డర్ (61:
93 బంతుల్లో), ద సిల్వ ((57:
84 బంతుల్లో) హాఫ్ సెంచరీలు చేసినా ఉపయోగం లేకుండా
పోయింది. రెండో ఇన్నింగ్స్‌లో 317 పరుగులకి విండీస్ ఆలౌటవగా ట్రెంట్ బౌల్ట్, నీల్
వాగ్నర్ చెరో మూడు వికెట్లు, టిమ్ సౌథీ, జేమీషన్ చెరో రెండు వికెట్లు ప్రాడగొట్టారు.