బాణామతి చేసారని అనుమానంతో వదిననే హత్య చేసిన వ్యక్తి అరెస్ట్
By: chandrasekar Wed, 23 Sept 2020 5:01 PM
అది సిద్ధిపేట జిల్లా
చేర్యాల మండలం కడవేర్గు గ్రామంలో భార్య లక్ష్మీ, భర్త నాగభూషణం, పిల్లలు
ఉన్నారు. భర్త నాగభూషణం కిష్టంపేటలోని తమ బంధువుల ఇంటికి వెళ్లాడు. లక్ష్మీ
పిల్లలు పొలానికి వెళ్లారు. ఇంట్లో లక్ష్మీ ఒక్కత్తే ఒంటరిగా ఉంది. తిరిగి లక్ష్మీ
భర్త నాగభూషణం ఇంటికి వచ్చి చూడగా రక్తపు మడుగులో లక్ష్మీ చనిపోయి ఉంది. ఎవరో
ఆమెను గొడ్డలితో నరికినట్లు ఆధారాలు కనిపించాయి. పోలీసులు దర్యాప్తు మొదలైంది. హత్య జరిగిన మర్నాడు అంటే సెప్టెంబర్ 22న
రాత్రి 7 గంటల
సమయంలో ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్‌కి వచ్చాడు. నేనే ఆమెను గొడ్డలితో నరికి చంపేశాను
అని చెప్పి లొంగిపోయాడు. లక్ష్మీ వరుసకు తనకు వదిన అవుతుందని చెప్పాడు. మరైతే
వదినను ఎందుకు చంపావు అంటే దానికి కారణం బాణామతి అని అన్నాడు.
నిందితుడు చెప్పిన వివరాల
ప్రకారం... "నాగభూషణం కుటుంబానికీ
మాకూ కొన్నేళ్లుగా గొడవలున్నాయి. నాగభూషణం కుటుంబం మంచిది కాదు. వాళ్లు బాణామతి
చేస్తారు. వాళ్లు వేసే మంత్రాల వల్ల మా కుటుంబంలో సభ్యులకు ఆరోగ్యం దెబ్బతింటోంది.
ఇలా చాలా సార్లు జరిగింది. అందుకే ఆ కుటుంబంపై కక్ష చుకున్నాను. వదిన లక్ష్మీని
చంపేయాలని నిర్ణయించుకున్నాను. సెప్టెంబర్ 21 ఉదయం 11 గంటలకు గొడ్డలిని సైకిల్‌కి తగిలించి ఎప్పుడెప్పుడు
ఆమెను చంపుదామా అని కాచుకు ఉన్నాను. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆమె
ఒక్కత్తే ఉన్నట్లు అర్థమైంది. తిన్నగా ఇంట్లోకి వెళ్లి ఆమె నన్ను చూసి అరిచేలోపే
గొడ్డలితో మెడపై నారికాను. ఆమె
చనిపోయిందని నిర్ణయించుకున్నాక అక్కడి
నుంచి పారిపోయాను" అని చెప్పాడు నిందితుడు. అతన్ని అరెస్టు చేసి జ్యుడీషియల్
రిమాండ్‌కి పంపారు. ఏపీసీ మాట్లాడుతూ... మంత్రాలు తంత్రాలు బాణామతి అనే
మూఢనమ్మకాలు నమ్మవద్దనీ ఎవరి మీదనైనా అనుమానం ఉంటే నేరుగా పోలీస్ స్టేషన్‌కి వచ్చి
తెలపాలని, లేదా
ఫోన్ ద్వారా సమాచారం అందించాలని, ప్రజలకు సూచించారు.