కనికరం లేకుండా నానమ్మను చంపేసిన మనవడు
By: chandrasekar Wed, 15 July 2020 7:50 PM
ఆ వృద్ధురాలు తన
ముగ్గురు ఆడబిడ్డలకు ఆస్తిలో వాటా ఇవ్వడమే ఆమె చేసిన నేరం. దీంతో తన తండ్రికి
ఆస్తి దక్కలేదనే అక్కసుతో నానమ్మపై పెట్రోల్ పోసి తగులబెట్టాడు. ఈ ఘటన
శంకర్ పల్లి మండలంలోని ఎల్లవర్తి గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం చోటు
చేసుకుంది.
ఎల్లవర్తి గ్రామానికి
చెందిన ఓ వృద్ధురాలికి కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వృద్ధురాలి భర్త కాలం
చేశాడు. దీంతో ఆమె పేర ఉన్న ఆస్తిలో ముగ్గురు ఆడబిడ్డలకు వాటా ఇచ్చింది. దీంతో
కుమారుడికి అనుకున్నంత ఆస్తి దక్కలేదు. ఈ క్రమంలో మనవడు శివకుమార్(14).. మేనత్తలకు ఆస్తిలో వాటా ఎందుకు ఇచ్చావని తన నానమ్మను ప్రశ్నించాడు.
ఆస్తి మొత్తం తన
తండ్రికే దక్కాలని.. వారికిచ్చిన వాటాను తిరిగి తీసుకోవాలని ఆమెపై శివ ఒత్తిడి
చేశాడు. మనవడి ప్రతిపాదనను ఆమె తిరస్కరించింది. దీంతో ఆగ్రహానికి లోనైన
శివ.. నానమ్మపై పెట్రోల్ పోసి తగులబెట్టాడు. వృద్ధురాలు అక్కడికక్కడే
ప్రాణాలు కోల్పోయింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం
మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శివకుమార్ ను పట్టుకునేందుకు
పోలీసులు యత్నిస్తున్నారు.