Advertisement

గాయపడిన జవాన్లను పరామర్శించిన నరేంద్ర మోదీ

By: chandrasekar Sat, 04 July 2020 11:28 AM

గాయపడిన జవాన్లను పరామర్శించిన నరేంద్ర మోదీ


గల్వాన్ ఘటనలో గాయపడిన జవాన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరామర్శించారు. ఘటన గురించి నేరుగా సైనికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో ఎదురొడ్డి పోరాడిన జవాన్ల భుజం తట్టి వారి ధైర్య సాహసాలను మెచ్చుకున్నారు. లఢక్ గల్వాన్ లోయలో జూన్ 15న బలగాల ఉపసంహరణ సమయంలో చైనా బలగాలు కుట్రపూరితంగా వ్యవహరించి కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది జవాన్లను పొట్టనపెట్టుకున్నారు.

ఈ ఘటనలో చైనా సైనికులు పెద్ద సంఖ్యలో చనిపోయినా డ్రాగన్ దేశం ఏ రకమైన వివరణ ఇవ్వలేదు. సుమారుగా 45 మంది దాకా చనిపోయారని కథనాలు వచ్చినప్పటికీ చైనా స్పష్టం చేయలేదు. గల్వాన్ ఘటన తర్వాత భారత్-చైనా మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. (Line of Actual Control) వాస్తవాధీన రేఖ వెంబడి వేలాది మంది సైనికులను రెండు దేశాలూ మోహరించాయి.

Tags :
|

Advertisement