రాబోయే ఆరు నెలల్లో కరోనా వైరస్ ప్రభావం తీవ్రం...
By: chandrasekar Mon, 14 Dec 2020 10:55 PM
కరోనా వ్యాక్సిన్ కోసం
మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కరోనా గురించి హెచ్చరిస్తూ...
రాబోయే ఆరు నెలల్లో సుమారు రెండు లక్షల మంది కరోనా వైరస్ వల్ల మృతిచెందే అవకాశాలు
ఉన్నట్లు ఇన్స్‌టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యువేషన్ అంచనా
వేసిందని పేర్కొన్నారు.
మనం మాస్క్‌లు ధరించడం
లాంటి నిబంధనలు పాటిస్తే మరణాలను నియంత్రించవచ్చు అని బిల్ గేట్స్ తెలిపారు.
అమెరికాలో కొన్ని వారాల నుంచి మళ్లీ కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు
అవుతున్నాయి.
అమెరికా కేసులను తగ్గించడంలో
మరింత ప్రయత్నిస్తుందని ఆశించినట్లు ఆయన అన్నారు. 2015లో తాను ఊహించిన దాని కన్నా తక్కువ మరణాలు సంభవించినా
అమెరికాతో పాటు ఇతర దేశాల్లో తాను అంచనా వేసిన దాని కన్నా ఆర్థిక సంక్షోభం
ఎక్కువ స్థాయిలో ఏర్పడిందన్నారు.
వ్యాక్సిన్ తయారీలో బిల్ గేట్స్ పలు
ఫార్మసీ సంస్థలకు ఫండింగ్ చేస్తున్నట్లు తెలిపారు. వ్యాక్సిన్ పంపిణీలో
అమెరికా మానవత్వం చాటాలని కోరారు.