పక్కింటి వ్యక్తి తన భార్యని చంపేశాడని ఆ వ్యక్తిని నరికేసిన భర్త
By: chandrasekar Sat, 01 Aug 2020 10:34 AM
ఓ దారుణ ఘటన బిహార్‌లోని
సుపౌల్ జిల్లాలో చోటుచేసుకుంది. చిన్నగొడవ రెండు ప్రాణాలను బలితీసుకుంది.
ఆవేశానికి గురైన ఓ వ్యక్తి పక్కింటి మహిళను కొట్టి చంపేశాడు. అది తెలుసుకున్న ఆమె
భర్త నిందితుడిని నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే నరికేశాడు.
ఈ సదర్ పోలీస్ స్టేషన్
పరిధిలోని సద్మా గ్రామానికి చెందిన లక్ష్మణ్ సదా(30), పవన్ సదా(26) పక్కపక్క
ఇళ్లలో నివాసముంటున్నారు. ఒక చిన్న విషయమై పవన్‌కి లక్షణ్ భార్య దేవి నడుమ వివాదం
తలెత్తింది. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో బలమైన వస్తువు తీసుకుని దేవిని
కొట్టడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది.
పక్కింటి వ్యక్తి తన
భార్యని చంపేశాడని తెలుసుకున్న లక్ష్మణ్ పొలం నుంచి ఆవేశంగా బయల్దేరాడు. పవన్‌ని
నడిరోడ్డుపైనే నరికేశాడు. అందరూ చూస్తుండగానే కిరాతకంగా హత్య చేశాడు. హత్యానంతరం
పారిపోకుండా పోలీసులు వచ్చే వరకూ వేచి చూసి లొంగిపోయాడు. తన భార్యని చంపేశాడన్న
కోపంతో పవన్‌ని హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు
జరుగుతున్నది.