రోజూ మా ఇంటికొచ్చి ఆమెని లైంగికంగా దోచుకునేవాడంటూ భర్త షాకింగ్ కంప్లైంట్
By: chandrasekar Thu, 03 Sept 2020 7:00 PM
అతను నా భార్యను లైంగికంగా దోచుకున్నాడంటూ భర్త పోలీసులను ఆశ్రయించాడు. నా భార్య అభ్యంతరకర ఫొటోలు తీసి బెదిరించి శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేశాడు. బెడ్రూమ్‌లో ఆమెతో అడ్డంగా దొరికిపోయాడు. రోజూ మా ఇంటికొచ్చి ఆమెని లైంగికంగా దోచుకునేవాడంటూ భర్త షాకింగ్ కంప్లైంట్ ఇచ్చాడు. అతని వేధింపులు భరించలేకనే తన భార్య సూసైడ్ చేసుకుందని విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను కోరాడు. ఈ షాకింగ్ ఘటన యూపీలో వెలుగుచూసింది. మీరట్ జిల్లాలోని మవానా పట్టణానికి చెందిన సందీప్ తన భార్య(28)తో కలసి మొహల్లా తాయ్ పరిధిలోని శివనగర్ జడ్డిలో నివాసముంటున్నాడు. సందీప్ భార్య వారం రోజుల కిందట ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. అయితే ఆమె ఆత్మహత్య ఘటనకు సంబంధించి భర్త సందీప్ షాకింగ్ కంప్లైంట్ ఇచ్చాడు. తన భార్యపై అదే ప్రాంతానికి చెందిన అర్జున్ లైంగిక దోపిడీకి పాల్పడ్డాడని అతని వేధింపులు భరించలేక తన భార్య ఆత్మహత్య చేసుకుందని ఫిర్యాదు చేశాడు.
ప్రతిరోజూ అర్జున్ తన ఇంటికి వచ్చేవాడని అక్రమ సంబంధం పెట్టుకోవాలంటూ తన భార్యను బలవంత చేసేవాడన్నాడు. ఆమె అభ్యంతరకర ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెడతానని బ్లాక్‌మెయిల్ చేసి ఆమె వద్ద నుంచి డబ్బులు వసూలు చేయడమే కాకుండా కామవాంఛలు తీర్చుకున్నాడని ఫిర్యాదులో తెలిపాడు. బెడ్రూమ్‌లో తన భార్యతో సెక్స్ చేస్తూ అడ్డంగా దొరికిపోయాడని ఆ ఘటనపై తాను కేసు కూడా పెట్టినట్టు చెప్పాడు. మూడేళ్లుగా ఆమెను వేధించి లైంగిక దోపిడీకి పాల్పడుతున్నాడని.. ఆ విషయం తెలిసి తాను నిలదీస్తే అక్రమ కేసులు పెట్టిస్తానంటూ బెదిరించాడని ఫిర్యాదు చేశాడు. నిత్యం శారీరక, మానసిక వేధింపులు భరించలేక తన భార్య ఆత్మహత్య చేసుకుందని సందీప్ పోలీసులకి ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు సర్కిల్ ఆఫీసర్ ఉదయ్ ప్రతాప్ సింగ్‌కి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. ఈ కేసును విచారణ జరుపుతున్నట్లు ఆయన తెలిపారు.