కరోనా వాక్సిన్ కోసం ఏకంగా రూ.50 వేల కోట్లు కేటాయించిన కేంద్రం?
By: chandrasekar Fri, 23 Oct 2020 09:26 AM
చాలా వరకు చివరి దశలో
వున్న కరోనా వాక్సిన్ రెడీ కాగానే వాటిని కొనుగోలు చేయడానికి ప్రభుత్వం బడ్జెట్ కేటయించింది.
కరోనా టీకా కోసం సుమారు రూ.50,000 కోట్ల (500 బిలియన్) నిధులను కేంద్ర ప్రభుత్వం పక్కన ఉంచినట్లు
సమాచారం. దేశంలోని 130 కోట్ల జనాభాకు కరోనా వ్యాక్సిన్ కోసం ఈ నిధులు
కేటాయించినట్లు తెలుస్తున్నది. ఒక వ్యక్తికి కరోనా టీకా వేసేందుకు సుమారు రూ.450 నుంచి
రూ.500 వరకు
ఖర్చు కావచ్చని అంచనా. ఈ నేపథ్యంలో దీనికి అవసరమ్యే నిధులను ఈ ఏడాది మార్చితో
ముగియనున్న ఆర్థిక సంవత్సరం బడ్జెట్ నుంచే సమకూర్చనున్నట్లు ప్రభుత్వ వర్గాలు
తెలిపాయి.
దేశంలో మరోవైపు హిమాలయాల
నుంచి అండమాన్ నికోబార్ దీవుల్లోని మారుమూల ప్రాంతాల వరకు ప్రతి ఒక్కరికి కరోనా
టీకా వేయడానికి సుమారు రూ.80,000 కోట్ల నిధులు అవసరమవుతాయని సిరమ్ ఇన్‌స్టిట్యూట్
ఆఫ్ ఇండియా సంస్థ అధిపతి అదార్ పూనవల్లా అంచనా వేశారు. కరోనా వ్యాక్సిన్
కొనుగోలుతోపాటు రవాణా, నిల్వ చేసేందుకు శీతల వనరులు, ప్రజలకు
పెద్ద ఎత్తున టీకా వేసేందుకు అవసరమైన మానవ వనరులు వంటి వాటి కోసం ఈ మేరకు నిధులు
అవసరమవుతాయని చెప్పారు.
అందరు ప్రజలకు అందించుటకు
దేశవ్యాప్తంగా టీకా సరఫరా అతి పెద్ద టాస్క్ అని అన్నారు. టీకా తొలుత అందరికీ
లభ్యం కాదని, ప్రతి ఒక్కరికి చేరేందుకు ముందస్తు ప్రణాళిక అవసరమని
అభిప్రాయపడ్డారు. కాగా కరోనా టీకా సిద్ధం కాగానే దేశంలోని ప్రతి ఒక్కరికి
అందుబాటులోకి వచ్చేలా తమ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ
మంగళవారం స్పష్టం చేశారు. మరోవైపు ప్రపంచ జనాభాకు అవసరమైన కరోనా వ్యాక్సిన్లను
ఆకాశ మార్గంలో తరలింపు కోసం సుమారు 8 వేల రవాణా విమానాలు అవసరమవుతాయని నిఫుణులు అంచనా
వేస్తున్నారు. మరి వాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో.