ఏపీ ప్రభుత్వం రైతు భరోసాతో పాటూ మరో శుభవార్త...
By: chandrasekar Tue, 27 Oct 2020 5:22 PM
ఏపీ రైతులకు జగన్ సర్కార్
నేడు రైతు భరోసా విడుదల చేస్తూ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ఈ
ఏడాది భారీ వర్షాలు, వరదల వల్ల వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతిన్న
రైతులకు ప్రభుత్వం రూ.135కోట్ల 70లక్షల 52 వేలు పెట్టుబడి రాయితీని విడుదల చేసింది.
జూన్ నుంచి సెప్టెంబర్
వరకు కురిసిన భారీ వర్షాలు, వరదలతో పంటలు దెబ్బతిన్నాయి. తుది అంచనాలు పూర్తి
చేసిన ప్రభుత్వం రాష్ట్ర విపత్తు సహాయ నిధి
నిబంధనావళి ప్రకారం 33 శాతానికి మించి వ్యవసాయ పంటలకు నష్టం వాటిల్లిన
రైతులకు రూ.113కోట్లు పెట్టుబడి రాయితీని విడుదల చేసింది. ఉద్యాన
పంటలు దెబ్బతిన్న రైతులకు రూ.22,58,84,000 మేర పెట్టుబడి రాయితీని విడుదల చేసింది.
జూన్, జూలైలో
వర్షాల వల్ల ఉభయ గోదావరి, కృష్ణా, కర్నూలు, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో రైతులకు వ్యవసాయ పంటలు
దెబ్బతిన్నాయి. వ్యవసాయ శాఖ కమిషనర్ ప్రతిపాదన మేరకు
ప్రభుత్వం పెట్టుబడి
రాయితీని విడుదల చేసింది. ఆగస్టు, సెపె్టంబర్‌లో కూడా పంటలు దెబ్బతిన్నాయి. వీటికి
పెట్టుబడి రాయితీని విడుదల చేసింది.
రైతుల బ్యాంకు ఖాతాలు, ఆధార్, ఇతర
సమాచారాన్ని పక్కాగా పరిశీలించి ధ్రువీకరించుకున్న తర్వాత ఆన్‌లైన్‌లోపెట్టుబడి
రాయితీ మొత్తాన్ని వారి ఖాతాలకు జమ చేయాలని వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్‌ను
ప్రభుత్వం ఆదేశించింది. ప్రకాశం, ఉభయ గోదావరి, వైఎస్సార్, కర్నూలు, కృష్ణా, విజయనగరం
జిల్లాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్న రైతులకు ప్రభుత్వంపెట్టుబడి రాయితీ విడుదల
చేసింది. ఈ మేరకు రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి
సోమవారం వేర్వేరు జీవోలు జారీ చేశారు.