తమిళనాడు సీఎం పళనిస్వామితో భేటీ అయిన స్టార్ హీరో విజయ్
By: Sankar Tue, 29 Dec 2020 10:40 AM
తమిళనాడు సీఎం పళనిస్వామితో సినీ నటుడు విజయ్ భేటీ అయ్యారు. అత్యంత రహస్యంగా ఆదివారం రాత్రి గ్రీన్‌వేస్ రోడ్డులోని సీఎం నివాసంలో ఆయన్ను కలిశారు. విజయ్‌ను రాజకీయాల్లోకి రప్పించడానికి ఆయన తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్ ఎంతో ప్రయత్నం చేశారు.
అయితే విజయ్ వ్యతిరేకత తెలపడంతో ఎన్నికల కమిషన్ వద్ద పార్టీ పేరు నమోదును వెనక్కు తీసుకోవాల్సి వచ్చింది. విజయ్ నటించిన మాస్టర్ చిత్ర నిర్మాణం పూర్తి చేసుకున్నా, తెర మీదకు రావడంలో సమస్యలు తప్పడం లేదు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఏప్రిల్‌లోనే విడుదల కావాల్సి ఉంది. అయి తే, కరోనా కారణంగా రిలీజ్ వాయిదా పడింది.
ప్రస్తుతం ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమయ్యా రు. జనవరి 13న సంక్రాంతి సందర్భంగా చిత్రం విడుదల కాబోతుంది. అయితే ప్రస్తుతం థియేటర్లలో 50 శాతం మేరకు మాత్రమే సీట్ల భర్తీకి అను మతి ఉంది. ఈ సమయంలో సినిమా విడుదల చేస్తే నష్టం తప్పదన్న ఆందోళనలో చిత్ర బృందం ఉంది.