సోను సూద్ కు విగ్రహం ఏర్పాటు చేసిన సిద్ధిపేట జిల్లా వాసి..
By: Sankar Mon, 21 Dec 2020 10:58 AM
లాక్‌డౌన్ సమయంలో కష్టాల్లో ఉన్న వారికి విశేషమైన సేవలందించి రియల్ హీరోగా నిలిచారు బాలీవుడ్ నటుడు సోనూ సూద్. ఈ నేపథ్యంలో ఓ అభిమాని సోనూ సూద్‌కి విగ్రహం ఏర్పాటు చేశాడు. అది కూడా సొంత ఖర్చుతో.
వివరాలు.. సిద్ధిపేట జిల్లా మద్దూరు మండలం దుబ్బ తండా పరిధిలోని చెలిమితండాకు చెందిన రాజేష్ రాథోడ్‌కు సోనూసూద్ అంటే అభిమానం. కరోనా సమయంలో ఆయన చేపట్టిన సేవా కార్యక్రమాలకు ముగ్ధుడైన రాజేష్ తమ తండాలో సోనూ సూద్ కోసం విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు.
రాజేష్ సొంత ఖర్చుతో ఏర్పాటు చేయడం గొప్ప విషయమని తండా వాసులు అభినందించారు. ఇక ఆదివారం స్థానికులు విగ్రహానికి పూజలు నిర్వహించి హారతి ఇచ్చారు..కాగా కరోనా లాక్ డౌన్ సమయం లో అనేక ఇబ్బందులు పడ్తున్న ప్రజలకు సోను సూద్ ఎంతో సాయం చేసాడు ...వలస కార్మికులు ఇళ్లకు వెళ్లలేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే సోనూసూద్ వారికి ఇంటికి వెళ్ళడానికి మార్గం చేయించాడు..ఇక లాక్ డౌన్ తర్వాత కూడా అనేక సేవ కార్యక్రమాలు చేస్తున్నాడు...