Advertisement

తెలంగాణాలో తాజాగా 518 కరోనా పాజిటివ్ కేసులు...

By: Sankar Fri, 25 Dec 2020 10:04 AM

తెలంగాణాలో తాజాగా 518 కరోనా పాజిటివ్ కేసులు...


రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 518 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో కేసుల సంఖ్య 2,84,074కు పెరిగింది.

కొత్తగా 491 మంది మహమ్మారి నుంచి కోలుకోగా.. మొత్తం 2,75,708 మంది కోలుకున్నారు. మరో ముగ్గురు వైరస్‌కు బలవగా.. మొత్తం 1527 మంది మరణించారు. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.53శాతంగా ఉందని, రికవరీ రేటు 97.05శాతంగా ఉందని ఆరోగ్యశాఖ పేర్కొంది.

ప్రస్తుతం రాష్ట్రంలో 6839 యాక్టివ్‌ కేసులున్నాయని, మరో 4723 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారని చెప్పింది. గురువారం ఒకే రోజు రాష్ట్రవ్యాప్తంగా 44,869 శాంపిల్స్‌ పరీక్షించామని, ఇప్పటి వరకు 66,55,987 టెస్టులు చేసినట్లు వివరించింది

Tags :
|

Advertisement