Advertisement

తెలంగాణ లో కరోనా కేసులు ఎన్నంటే !

By: Sankar Thu, 31 Dec 2020 10:10 AM

తెలంగాణ లో కరోనా కేసులు ఎన్నంటే !

తెలంగాణలో కరోనా కేసులు మళ్ళీ క్రమంగా పెరుగుతున్నాయి. గత మూడు రోజులుగా వరసగా పెరుగుతూ వచ్చిన కేసులు నాలుగో రోజున కొద్దిగా తగ్గాయి.

తాజాగా తెలంగాణ ప్రభుత్వం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం, కొత్తగా 415 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు మొత్తం 2,86,354 కేసులు నమోదు కాగా, ఇందులో 2,78,839 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 5,974 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.

తాజా బులెటిన్ ప్రకారం తెలంగాణలో కరోనాతో ముగ్గురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1541కి చేరింది.

Tags :
|
|

Advertisement