తెరాస ఎంపీ బీబీ పాటిల్ కు కరోనా పాజిటివ్
By: Sankar Thu, 22 Oct 2020 4:06 PM
దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రోజు రోజుకు వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నప్పటికీ కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడం లేదు. సాధారణ ప్రజలతోపాటు ప్రముఖులు సైతం కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది.
పలువురు ప్రజాప్రతినిధులు, సెలబ్రెటీలు కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు. అయితే తెలంగాణలో కరోనా వైరస్ ప్రజాప్రతినిధులను వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే డిప్యూటీ సీఎం, డిప్యూటీ స్పీకర్, మంత్రి హరీష్ రావు పలువురు ఎమ్మెల్యేలు, హైదరాబాద్ మేయర్ ఇలా.. చాలా మంది ప్రజాప్రతినిధులు కరోనా బారినపడ్డారు.. వీరిలో పలువురు ఇప్పటికే పూర్తిస్థాయిలో కోలుకున్నారు.
ఇక తాజాగా ఎంపీ బీబీ పాటిల్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ లో వెల్లడించారు. కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లిపోయారు. తనను కలిసిన నేతలు, నాయకులు, ప్రజలు కరోనా టెస్టులు చేయించుకోవాలని కోరారు.