Advertisement

  • ఇంటర్ సిలబస్ తగ్గింపు యోచనలో తెలంగాణ ఇంటర్ బోర్డు

ఇంటర్ సిలబస్ తగ్గింపు యోచనలో తెలంగాణ ఇంటర్ బోర్డు

By: Sankar Fri, 10 July 2020 12:48 PM

ఇంటర్ సిలబస్ తగ్గింపు యోచనలో తెలంగాణ ఇంటర్ బోర్డు



తెలంగాణలోనూ ఇంటర్మీడియట్ సిలబస్‌ను కుదించేందుకు రాష్ట్ర ఇంటర్ బోర్డు కసరత్తు ప్రారంభించింది. సీబీఎస్ఈ 9 నుంచి 12వ తరగతి వరకు 30 శాతం సిలబస్‌ను కుదించినట్లుగానే రాష్ట్రంలోనూ ఆ మేరకు చర్యలు చేపట్టాలని నిర్ణయించింది.

ఎంపీసీ, బైపీసీ గ్రూపులకు సంబంధించిన సిలబస్ సీబీఎస్ఈలో, రాష్ట్రంలో ఒకే మాదిరిగా ఉంటుంది కాబట్టి ఆయా గ్రూపుల్లో సీబీఎస్ఈ తొలగించే పాఠ్యాంశాలను రాష్ట్రంలోనూ తొలగించాలని ఇంటర్ బోర్డు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ వంటి సబ్జెక్టుల్లో సీబీఎస్‌ఈ ప్రకారమే తొలగింపును అమలు చేయనుంది.

ఇక ఆర్ట్స్, భాషా సబ్జెక్టులు మాత్రం రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగానే చాలా వరకు ఉంటాయి కాబట్టి స్థానికంగానే నిర్ణయం తీసుకోనుంది. భాషా, ఆర్ట్స్‌ సబ్జెక్టుల్లో సీబీఎస్‌ఈ తొలగించే పాఠ్యాంశాలు ఉంటే వాటిని తొలగించడంతోపాటు స్థానిక అంశాలకు సంబంధించిన సిలబస్‌ను కుదించాలని భావిస్తోంది.

Tags :
|
|

Advertisement