Advertisement

  • నూతన సంవత్సర వేడుకలు బ్యాన్ చేయకపోవడంతో తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్ట్ ఆగ్రహం

నూతన సంవత్సర వేడుకలు బ్యాన్ చేయకపోవడంతో తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్ట్ ఆగ్రహం

By: Sankar Thu, 31 Dec 2020 8:18 PM

నూతన సంవత్సర వేడుకలు బ్యాన్ చేయకపోవడంతో తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్ట్ ఆగ్రహం


నూతన సంవత్సర వేడుకలను తెలంగాణ ప్రభుత్వం బ్యాన్‌ చేయడకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పబ్బులకు, బార్‌లకు విచ్చలవిడిగా అనుమతులు ఇచ్చి ప్రజలను ఏం చేద్దామనుకుంటున్నారని ఘాటుగా ప్రశ్నించింది.

పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ కొత్త వైరస్‌ మోర్ డేంజర్‌ అంటుంటే.. న్యూ ఇయర్‌ వేడుకలకు ఎలా అనుమతి ఇచ్చారని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. కొత్త రకం కరోనా వైరస్‌ నేపథ్యంలో రాజస్తాన్‌, మహారాష్ట్రలో వేడుకలు ఇప్పటికే బ్యాన్ చేశారని, తెలంగాణలో ఎందుకు చేయలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.

హైకోర్టు వ్యాఖ్యలపై స్పందించిన అడ్వకేట్‌ జనరల్‌.. కరోనా దృష్ట్యా వేడుకలు జరుపుకోవద్దని ప్రజలకు సూచించామన్నారు. ప్రభుత్వ వాదనతో ఏకీభవించని న్యాయస్థానం.. డిసెంబర్‌ 31న పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. భౌతిక దూరం, మాస్క్‌లు తప్పకుండా వినియోగించేలా చూడాలని ఆదేశించింది..

Tags :

Advertisement