ఉద్యోగులకు , పెన్షనర్లకు శుభవార్త చెప్పిన కెసిఆర్ ..
By: Sankar Wed, 30 Sept 2020 8:06 PM
ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం... కరోనావైరస్, లాక్‌డౌన్ ఆర్థికవనరులను దెబ్బకొట్టడంతో ప్రభుత్వం ఉద్యోగుల జీతాలతో పాటు.. పెన్షన్లు కూడా కోత పెట్టింది.. అయితే, ఇక, ఆర్థికంగా వెసులుబాటు కలగడంతో ఇప్పుడు పూర్తిస్థాయిలో జీతాలు చెల్లిస్తున్నారు.
మరోవైపు.. కరోనా కారణంగా కోత విధించిన వేతనాల బకాయిలు కూడా చెల్లించాలనే నిర్ణయానికి వచ్చింది సర్కార్.. దీనికి సంబంధించిన చెల్లింపుల విధానాన్ని ప్రకటించింది ప్రభుత్వం.. పెన్షనర్లకు అక్టోబర్, నవంబర్ నెలల్లో రెండు విడతలుగా పెండింగ్ పెన్షన్లను చెల్లించనున్నారు. ఇక, అధికారులు, సిబ్బందికి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో మూడు విడతలుగా చెల్లించనున్నట్టు ప్రకటించింది.
కాగా, కరోనా సమయంలో.. మెడికల్, శానిటేషన్, మున్సిపల్, పంచాయతీ, వాటర్ బోర్డు, పోలీస్ సిబ్బంది కరోనా కట్టడిలో వారియర్స్ గా పనిచేశారు.. ప్రాణాలను పణంగా పెట్టిడ్యూటీలు చేస్తున్న వీరికి అదనంగా 10 శాతం సీఎం గిఫ్ట్ కింద ఇస్తామని ప్రకటించారు. ఇక, మిగతా అన్ని విభాగాల్లోని ఉద్యోగుల జీతాల్లో కోతపెట్టిన సంగతి తెలిసిందే.