Advertisement

రేపే తెలంగాణ ఎంసెట్ ఫలితాలు

By: Sankar Mon, 05 Oct 2020 8:56 PM

రేపే తెలంగాణ ఎంసెట్ ఫలితాలు


రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎంసెట్‌ పరీక్షా ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయి.

తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రేపు మధ్యాహ్నం 3.30 గంటలకు కూకట్‌పల్లిలోని జేఎన్టీయూలో ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ప్రవేశాల కమిటీ పూర్తి చేసినట్లు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. ఈ పరీక్షలకు 1,43,330 మంది విద్యార్థులు రిజిస్టర్‌ చేసుకోగా, 1,19,187 మంది (83.16 శాతం) విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.

ఇంజనీరింగ్‌ ఎంసెట్‌ నిర్వహించిన సమయంలో కరోనా బారిన విద్యార్థుల నుంచి ఎంసెట్‌ కమిటీ దరఖాస్తులను స్వీకరించింది. వారికి ఈనెల 8వ తేదీన పరీక్ష నిర్వహించాలని భావిస్తోంది. 9వ తేదీ నుంచి ఇంజనీరింగ్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌ను ప్రారంభించనున్న నేపథ్యంలో ఆ తరువాత రెండు మూడుల్లో వారి ఫలితాలను విడుదల చేయనుంది. ఇక గత నెల 28, 29 తేదీల్లో నిర్వహించిన అగ్రికల్చర్‌ ఎంసెట్‌ ఫలితాలను కూడా వచ్చే వారంలో విడుదల చేసేందుకు చర్యలు చేపట్టింది.

Tags :
|

Advertisement