కాంట్రాక్టు లెక్చరర్ల బదిలీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తెలంగాణ సీఎం కెసిఆర్
By: Sankar Mon, 16 Nov 2020 06:40 AM
తెలంగాణ ప్రగతిభవన్‌లో సీఎం అధ్యక్షతన జూనియర్ కాలేజీ కాంట్రాక్టు లెక్చరర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
జూనియర్ కాలేజీ లెక్చరర్లు ఎదుర్కొంటున్న సమస్యలను విద్యాశాఖ మంత్రి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి సీఎం దృష్టికి తీసుకువచ్చారు. అర్షత కలిగివుండి, భర్తీకి అవకాశం వున్న ఇతర ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేయడానికి వెళ్లదలుచుకున్న, జూనియర్ కళాశాల కాంట్రాక్టు లెక్చరర్లకు అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు విధి విధానాలను రూపొందించాలని అధికారులను సిఎం ఆదేశించారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. జూనియర్ కాలేజీ కాంట్రాక్టు లెక్చరర్ల విషయంలో ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టిందన్నారు. వారిని రెగ్యులరైజ్ చేయాలనే ప్రభుత్వ ప్రయత్నం కోర్టులో కేసుల వల్ల నిలిచిపోయిందన్నారు. అయినా అంతటితో ఆగకుండా వారి నెల జీతాలను గతంలో కంటే రెట్టింపు చేశామన్నారు