ప్రగతి భవన్ లో రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం
By: Sankar Thu, 12 Nov 2020 6:45 PM
ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అధ్యక్షతన తెలంగాణ మంత్రిమండలి సమావేశం కానుంది. రేపు ఉదయం (శుక్రవారం) ప్రగతి భవన్‌లో ఈ భేటీ జరుగనుంది.
త్వరలో జరుగనున్న గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలపై కేబినెట్ ప్రధానంగా చర్చించనుంది. దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల అనంతరం సీఎం తొలిసారి మంత్రిమండలి సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఈ భేటీపై ఆసక్తి నెలకొంది. దుబ్బాక ఫలితాలపై కూడా ఈ సమావేశంలో సీఎం చర్చించనున్నారు. ఓటమికి గల కారణాలను మంత్రులతో కలిసి విశ్లేషించనున్నారు.
అలాగే పట్టభద్రుల కోటాలో జరిగే రెండు ఎమ్మెల్సీ స్థానాలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ స్థానానికి అభ్యర్థి ఎంపికపై సమాలోచనలు జరుపనున్నారు
Tags :
cabinet |
meeting |
tomorrow |