Advertisement

  • ఢిల్లీ మరియు ముంబై మధ్య రైళ్లు, విమానాల రాకపోకలు నిలిపివేత?

ఢిల్లీ మరియు ముంబై మధ్య రైళ్లు, విమానాల రాకపోకలు నిలిపివేత?

By: chandrasekar Sat, 21 Nov 2020 10:31 AM

ఢిల్లీ మరియు ముంబై మధ్య రైళ్లు, విమానాల రాకపోకలు నిలిపివేత?


దేశ రాజధానిలో కరోనా అమాంతం పెరిగి పోవడంతో ఢిల్లీ మరియు ముంబై మధ్య రైళ్లు, విమానాల రాకపోకలు నిలిపేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీలో కరోనావైరస్ మరోసారి విజృంభిస్తుండటంతో కరోనా కారణంగా తీవ్ర ప్రభావానికి గురైన మహారాష్ట్ర సర్కార్ మరోసారి ఆలోచనలో పడింది. పరిస్థితి చేయి దాటి పోకముందే తేరుకోకపోతే మహారాష్ట్రలో సైతం సెకండ్ వేవ్ చూడాల్సి వస్తుందని ఆందోళనకు గురవుతున్న మహారాష్ట్ర సర్కార్ వెంటనే అందుకు పరిష్కారంగా ఢిల్లీ నుంచి ముంబై మధ్య రైళ్లు, విమానాల రాకపోకలు నిలిపేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీ - ముంబై మధ్య నిత్యం వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుండటంతో వారి ద్వారా కరోనా కేసులు పెరిగే ప్రమాదం ఉంటుందనే కోణంలో మహారాష్ట్ర సర్కార్ ఆలోచిస్తున్నట్టు సమాచారం.

ఇంతకుముందు మహారాష్ట్రలో కరోనా వల్ల భారీగా ప్రజలు ప్రాణాలు పోగొట్టుకున్న సంగతి తెలిసిందే. ఢిల్లీలో పరిస్థితి సద్దుమణిగే వరకు ఢిల్లీ నుంచి ముంబైకి వచ్చే రైళ్లు, విమానాలను నిలిపేస్తే ముంబైలో కరోనా కేసులు పెరగకుండా కొంతవరకైనా ఆపవచ్చని ఉద్ధవ్ థాకరే సర్కార్ భావిస్తోందట. అయితే దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడకపోవడం గమనార్హం. ఢిల్లీలో నిన్న గురువారం ఒక్క రోజే 7,456 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇటీవల పండగల సీజన్‌లో రద్దీ ప్రదేశాల్లో జనం తాకిడి పెరగడం, కాలుష్యం పెరగడంతో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిన సంగతి తెలిసిందే. వైరస్ కట్టడికి ఇలాంటి చర్యలు ఎంతగానో ఉపయోగపడనుంది.

Tags :

Advertisement