బీహార్ ఎన్నికల ఫలితాలపై సర్వే వెల్లడి
By: chandrasekar Wed, 21 Oct 2020 09:58 AM
ఈ నెల బీహార్లో మొదటి
విడత ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఫలితాలపై సర్వే
వెల్లడించారు. బీహార్‌లో గెలవబోయేదెవరో లోక్‌నీతి-సీఎస్‌డీఎస్ సర్వే తేల్చి
చెప్పింది. జెడియూ-బీజేపీ సారధ్యంలో ఎన్డీయే 133 నుంచి 143 స్థానాలతో అధికారంలోకి వస్తుందని వెల్లడించింది. 243
స్థానాలున్న బీహార్‌లో ఆర్జేడీ-కాంగ్రెస్ సారధ్యంలోని మహాకూటమికి 88 నుంచి
98 వరకూ
స్థానాలు దక్కవచ్చని సర్వే తెలిపింది. రాం విలాస్ పాశ్వాన్ కుమారుడు సారధ్యం
వహిస్తోన్న లోక్ జనశక్తి పార్టీకి రెండు నుంచి ఆరు స్థానాల్లో విజయం లభించవచ్చని, ఇతరులు
ఆరు నుంచి పది స్థానాల్లో గెలవవచ్చని సర్వే అంచనా వేసింది.
ఎన్నికల్లో భాగంగా
రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం జోరుగా సాగుతుంది. ఎన్డీయేకు 38 శాతం, మహాకూటమికి
32 శాతం
ఓట్లు దక్కుతాయని అంచనా. ఎల్‌జేపీకి ఆరు శాతం ఓట్లు దక్కుతాయని ఒపీనియన్ పోల్
వెల్లడించింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు మొత్తం 3 విడతల్లో జరగనున్నాయి. ఈ
నెల 28న తొలి
విడత, నవంబర్
3న
రెండో విడత, నవంబర్ ఏడున మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్
పదిన ఫలితాలు ప్రకటిస్తారు. ఫలితాలు వెలువడిన తరువాత గాని సర్వే ఫలితాల గురించి
తెలియరావు.