- హోమ్›
- వార్తలు›
- తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో అన్ని స్థానాల నుంచి బరిలోకి దిగనున్న సూపర్ స్టార్ రజినికాంత్
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో అన్ని స్థానాల నుంచి బరిలోకి దిగనున్న సూపర్ స్టార్ రజినికాంత్
By: Sankar Sun, 06 Dec 2020 07:01 AM
సౌత్ ఇండియా సూపర్ స్టార్, తలైవా రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నట్టు ట్విట్టర్ ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 31 వ తేదీన పార్టీ పేరు, జనవరి 2021న పార్టీ కార్యాచరణ మొదలుపెట్టబోతున్నారు.
2021లో తమిళనాడులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఇప్పటికే సంకేతాలు పంపించారు. రజినీకాంత్ పార్టీ పెడితే ఆయనతో కలిసి పొత్తు పెట్టుకునేందుకు అన్నాడిఎంకె, బీజేపీలు సిద్ధంగా ఉన్నాయి. ఆ దిశగా ఇప్పటికే చర్చలు జరుపుతున్నారు.
అయితే, రజినీకాంత్ పార్టీ పెట్టిన తరువాత తమిళనాడులోని అన్ని స్థానాల నుంచి పోటీ చేయబోతున్నారని రజినీకాంత్ సలహాదారుడు మణియన్ తెలిపారు..అంటే రజిని 234 స్థానాల నుంచి పోటీచేస్తాడని తెలుస్తుంది..ఇదే గాని జరిగితే తమిళ నాట రాజకీయాలు సరికొత్త మలుపు తిరిగే అవకాశం ఉంది...