అభిమాన సంఘాల జిల్లా అధ్యక్షులతో సమావేశంకానున్న సూపర్ స్టార్ రజనీకాంత్
By: Sankar Sun, 29 Nov 2020 11:04 AM
వచ్చే ఏడాది జరగనున్న తమిళ నాడు ఎన్నికలపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ ఎన్నికలలో పోటీ చేసేందుకు కమల్ హాసన్ ఇప్పటికే సిద్దం కాగా, రజనీకాంత్ కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే కరోనా వలన రజనీకాంత్ కాస్త వెనక్కు తగ్గాడని ఈ మధ్య ఓ ప్రచారం అయితే జోరుగా జరగగా, దీనిపై డిసెంబర్‌లో పూర్తి క్లారిటీ రానుందని అభిమానులు భావించారు,
రజనీకాంత్ తాజాగారాజకీయ ఉత్కంఠతకు తెర తీశారు. నవంబర్ 30న తన అభిమాన సంఘాల అధ్యక్షులని చెన్నైకి ఆహ్వానించగా, వారితో తొమ్మిది గంటల పాటు చర్చించి ఎలా చేద్దాం, ఏం చేద్దాం అనే దానిపై నిర్ణయం తీసుకుంటారట. మరి ఆ రోజు రజనీకాంత్ ఎలాంటి సంచలన నిర్ణయం తీసుకోనున్నారని అందరిలో ఉత్కంఠ నెలకొంది.
కాగా, రజనీకాంత్‌కి కిడ్నీ మార్పిడి జరగగా, కరోనా వలన జనాల మధ్య తిరగలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ ఆరంగేట్రం గురించి ఆలోచిస్తున్నారు.అభిమానులు చాల మంది ఎప్పటినుంచి రజనీకాంత్ ప్రత్యక్ష రాజకీయాలలోకి రావాలని కోరుకుంటున్నారు...