ఏపీ సీఎం జగన్ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసిన సూపర్ స్టార్ మహేష్
By: Sankar Sun, 20 Dec 2020 11:31 AM
ఏపీలో థియేటర్లు చెల్లించాల్సిన 3 నెలల ఫిక్స్‌డ్ ఎలక్ట్రిసిటీ ఛార్జీలు రద్దు చేస్తూ ఏపీ మంత్రి మండలి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి మల్టీప్లెక్స్‌లు సహా, అన్ని థియేటర్లకూ ఫిక్స్‌డ్ ఎలక్ట్రిసిటీ ఛార్జీలు రద్దు చేయనుంది. నెలకు రూ.3 కోట్ల రూపాయల చొప్పున ప్రభుత్వం భరించనుందని తెలిపింది. దీంతో సినీ ప‍్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు..
అయితే గౌరవనీయులైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయం హర్షణీయం! విపత్కర సమయంలో ఇలాంటి ఉద్దీపన చర్యలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వానికి బిగ్ థాంక్యూ. తెలుగు సినీ పరిశ్రమ తిరిగి పూర్వవైభవంతో వెలిగిపోయేందుకు ఇవి ఉపయోగపడతాయి. సినిమా మళ్లీ ట్రాక్‌లో పడుతోంది’’ అని సీఎం వైఎస్ జగన్ నిర్ణయం పట్ల సూపర్‌స్టార్ మహేష్ బాబు హర్షం వ్యక్తం చేశారు.