నటి కంగనా రనౌత్ కు మరియు ఆమె సోదరి రంగోలి చందెల్‌కు సమన్లు
By: chandrasekar Thu, 22 Oct 2020 09:15 AM
ప్రముఖ నటుడు సుశాంత్
సింగ్ మరణం తరువాత బాలీవుడ్ లో పలు సంఘటనలు చోటుచేసుకున్నాయి. బాలీవుడ్ నటి కంగనా
రనౌత్‌కు, ఆమె
సోదరి రంగోలి చందెల్‌కు ముంబై పోలీసులు సమన్లు జారీ చేశారు. అక్టోబర్ 26
మరియు 27 అంటే వచ్చే సోమవారం
మరియు మంగళవారం విచారణకు హాజరుకావాలని నోటీసులో ముంబై పోలీసులు పేర్కొన్నారు.
ముంబైలోని బాంద్రా పోలీస్
స్టేషన్‌లో 124ఏ సెక్షన్‌తో పాటు పలు సెక్షన్ల కింద కంగనాపై, ఆమె
సోదరిపై ఎఫ్‌ఐఆర్ నమోదైన సంగతి తెలిసిందే. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో కేంద్ర
దర్యాప్తు బృందాల విచారణ కొనసాగుతున్న సందర్భంలో కంగనా ప్రజల్లో అనుమానాలు
రేకెత్తేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిందన్నారు.
ఇంతటితో ఆగకుండా ముంబైని
పాక్ ఆక్రమిత కశ్మీర్‌గా పోల్చుతూ ప్రజల మధ్య విభేధాలు సృష్టించే విధంగా కంగనా
ట్వీట్ చేసిందని ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. దీంతో కంగనా రనౌత్‌పై, ఆమె
సోదరి రంగోలిపై దేశ ద్రోహం కేసు నమోదు చేయాలని ముంబైలోని బాంద్రా మేజిస్ట్రేట్
మెట్రో పాలిటన్ కోర్టు పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో ముంబై పోలీసులు
వారిపై దేశద్రోహం కేసు నమోదు చేశారు.