విజయవంతంగా ముగిసిన భారత్ బంద్
By: Sankar Tue, 08 Dec 2020 4:52 PM
భారత్ బంద్ శాంతియుతంగా ముగిసింది. రైతులకు మద్దతు యావత్ భారత్ కదిలింది... రైతుల పోరాటానికి సంఘీభావంగా... దేశవ్యాప్తంగా 25 రాజకీయ పార్టీలు ఇవాళ భారత్ బంద్‌లో పాల్గొన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకే భారత్ బంద్ నిర్వహించాలన్న రైతు సంఘాల పిలుపుతో.. దేశమొత్తం స్తంభించిపోయింది. ఎక్కడికక్కడ రైళ్లు, బస్సులు, ప్రైవేట్ వాహనాలు నిలిచిపోయాయి.
తెలుగు రాష్ట్రాల్లోనూ భారత్ బంద్ విజయవంతంగా సాగింది.. తెలంగాణలో రోడ్లపైకి వచ్చారు అధికార టీఆర్ఎస్ నేతలు.. పలు ప్రాంతాల్లో రాస్తారోకోలో పాల్గొన్నారు తెలంగాణ మంత్రులు. మరోవైపు.. టీఆర్ఎస్ నేతలు, సీపీఎం, సీపీఐ ఇతర వామపక్ష పార్టీలకు చెందిన నేతలు కూడా పెద్ద ఎత్తున భారత్ బంద్‌లో భాగంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. మోడీ ప్రభుత్వానివి రైతు వ్యతిరేక విధానాలంటూ నినాదాలు చేశారు..
వ్యవసాయ చట్టాల్ని రద్దు చేసేదాకా పోరాడతామని ప్రతిపక్షాలు స్పష్టం చేశాయి.. రైతులకు పూర్తిగా అండగా నిలుస్తామని ప్రకటించారు వివిధ పార్టీల నేతలు.. ఇక, బంద్ సక్సెస్ చేసిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు రైతు సంఘాల నేతలు. కొత్త వ్యవసాయ చట్టాలు రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.