అన్నీ రంగాల్లోనూ రికార్డ్ స్థాయిని తాకిన స్టాక్ మార్కెట్లు
By: chandrasekar Tue, 10 Nov 2020 10:21 AM
అన్నీ రంగాల్లోనూ స్టాక్
మార్కెట్లు రికార్డ్ స్థాయిని తాకాయి. స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో
ముగిశాయి. ఉదయం భారీ లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు, ఏ
దశలోనూ తగ్గలేదు. సూచీలు రికార్డ్ స్థాయిని తాకాయి. సెన్సెక్స్ 704.37 పాయింట్లు(1.68%) ఎగిసి 42,597.43 వద్ద, నిఫ్టీ 197.50 పాయింట్లు(1.61%)
లాభపడి 12,461 పాయింట్ల వద్ద ముగిసింది. 1479
షేర్లు లాభాల్లో, 1155 షేర్లు నష్టాల్లో ముగియగా, 181
షేర్లలో ఎలాంటి మార్పులేదు. అన్ని రంగాలు లాభాల్లోనే ముగిశాయి. బ్యాంకింగ్, ఎనర్జీ
స్టాక్స్ దాదాపు రెండు శాతానికి పైగా లాభపడ్డాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్
క్యాప్ సూచీలు ఒక శాతానికి పైగా ఎగిశాయి. సెన్సెక్స్ 700 పాయింట్లకు పైగా ఎగసింది. సెన్సెక్స్, నిఫ్టీ
ఆల్ టైమ్ గరిష్టాన్నితాకాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోబిడెన్ గెలుపు
నేపథ్యంలో ఐటీ, బ్యాంకింగ్ స్టాక్స్ పుంజుకున్నాయి. నిఫ్టీ స్టాక్స్‌లో
43
లాభాల్లో, 7
నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 30లో 27 లాభాల్లో, 3 నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ ఆటో 0.77 శాతం, నిఫ్టీ
బ్యాంకు 2.74 శాతం, నిఫ్టీ
ఎనర్జీ 2.05 శాతం, నిఫ్టీ
ఫైనాన్షియల్ సర్వీసెస్ 2.05 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 1.01 శాతం, నిఫ్టీ
ఐటీ 1.53 శాతం, నిఫ్టీ
మెటల్ 1.80 శాతం, నిఫ్టీ
ఫార్మా 0.44 శాతం, నిఫ్టీ
పీఎస్‌యూ బ్యాంకు 1.03 శాతం, నిఫ్టీ రియాల్టీ 1.48 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 3.28 శాతం
లాభపడ్డాయి. నిఫ్టీ మీడియా మాత్రం 0.01 శాతం నష్టపోయాయి. డాలర్ మారకంతో రూపాయి 73.94 వద్ద
ప్రారంభమై..74.20 వద్ద ముగిసింది.
గత శుక్రవారం సెన్సెక్స్ 41,893 పాయింట్లు పెరిగింది. ఆల్ టైమ్ గరిష్టం 42,274కు గతవారం మరో 381 పాయింట్ల దూరంలో నిలిచింది. ఈ రోజు సెన్సెక్స్ ఏకంగా
700
పాయింట్లకు పైగా ఎగిసింది. దీంతో మరోసారి ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది. టాప్
గెయినర్స్ జాబితాలో దివిస్ 5.76 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 4.98 శాతం, భారతీ
ఎయిర్‌టెల్ 4.87 శాతం, ఐసీఐసీఐ బ్యాంకు 4.49 శాతం, యాక్సిస్ బ్యాంకు 4.30 శాతం లాభపడ్డాయి. టాప్
లూజర్స్ జాబితాలో సిప్లా 3.39 శాతం, అదానీ పోర్ట్స్ 1.09 శాతం, ఐటీసీ 0.66 శాతం, మారుతీ సుజుకీ 0.51 శాతం, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 0.48 శాతం
నష్టపోయాయి. మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో రిలయన్స్, దివిస్ ల్యాబ్స్, ఇండస్ఇండ్
బ్యాంకు, ఐసీఐసీఐ
బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ
బ్యాంకులు ఉన్నాయి.