అంతుచిక్కని వ్యాధి కాదని కజకిస్థాన్ ఆరోగ్య శాఖ ప్రకటన
By: chandrasekar Sat, 11 July 2020 10:47 AM
ప్రపంచమంతా కరోనా వైరస్‌తో
పోరాటం చేస్తున్నవేళ కజకిస్థాన్‌లో కొత్త రకం వ్యాధి ప్రబలిందని చైనా ప్రకటించింది.
కజికిస్థాన్‌ను అంతుచిక్కని వ్యాధి విస్తరిస్తున్నదంటూ చైనా చేసిన ప్రకటనను
కజకిస్థాన్ ప్రభుత్వం కొట్టిపారేసింది. చైనా ప్రకటనలో నిజం లేదని
తేల్చిచెప్పింది.
ఈ అంతుచిక్కని
న్యూమోనియా వ్యాధి బారినపడి గత నెల రోజుల వ్యవధిలో 1772 మంది
ప్రాణాలు కోల్పోయారని, అది కరోనా మహమ్మారికంటే ప్రమాదకరమని
పేర్కొన్నది. అందువల్ల ఆ దేశంలోని చైనీయులు అప్రమత్తంగా ఉండాలని కజకిస్థాన్‌లోని
చైనా రాయబార కార్యాలయం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో చైనా ఎంబసీ ప్రకటనను
ఖండిస్తూ కజికిస్థాన్ ప్రభుత్వం తాజా ప్రకటన చేసింది.
ప్రస్తుతం దేశంలో ప్రబలుతున్న
వ్యాధికి వైరల్ న్యూమోనియా ఇన్‌ఫెక్షన్, బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్‌ఫెక్షన్
లక్షణాలతో పోలికలు ఉన్నాయని తెలిపింది. ఈ వ్యాధి కారణంగా అధిక మరణాలు సంభవిస్తున్నమాట
వాస్తవమే అయినా, ఇది అంతుచిక్కని వ్యాధి మాత్రం కాదని కజకిస్థాన్
ఆరోగ్య శాఖ పేర్కొన్నది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దీనిపై రిపోర్టు ఇచ్చిందని కజకిస్థాన్
తెలిపింది.