Advertisement

కనిపించిన చిరుత ఆచూకీ

By: Sankar Wed, 20 May 2020 3:51 PM

కనిపించిన చిరుత ఆచూకీ


ఈనెల 14వ తేదీన కాటేదాన్ అండర్‌బ్రిడ్జి రోడ్డుపై గాయాలతో ఉన్న ఓ చిరుత కనిపించి తప్పించుకున్న విషయం అందరికి తెలిసిందే. చిరుతని పట్టుకోవడానికి కుక్కలను వదిలిన అధికారులు. అయితే ఆచిరుత ఆచూకీ ఎట్టకేలకు లభించింది. గండిపేట మండలంలోని హిమాయత్‌సాగర్ ఒడ్డున ఉన్న జీవీకే గార్డెన్స్‌లో ఇది కనిపించింది. అక్కడి స్విమ్మింగ్‌పూల్‌లో చిరుత నీళ్లు తాగుతుండడాన్ని గమనించిన వాచ్‌మన్ వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో స్పందించిన అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని చిరుతను బంధించేందుకు గార్డెన్‌లోకి కుక్కలను వదిలిపెట్టారు. మారోమారు అది తప్పించుకోకుండా జాగ్రత్త పడుతున్నారు.

Tags :
|

Advertisement