దేశంలోనే తొలి ఎలక్ట్రిక్ ట్రాక్టర్ ను రిలీజ్ చేసిన సోనాలిక
By: Sankar Thu, 24 Dec 2020 4:42 PM
ఈ భూమి మీద పొల్యూషన్ రోజురోజుకి పెరిగిపోతుంది ముఖ్యంగా వాహనాల ద్వారా గాలి ఎక్కువగా పొల్యూషన్ అవుతుంది ..దీనితో పెట్రోల్ , డీజిల్ తో నడిచే వాహనాల స్థానంలో కొత్తగా ఎలక్ట్రిక్ వాహనాలు వస్తున్నాయి ...ఇప్పటివరకు స్కూటర్లు ఎక్కువగా ఎలక్ట్రిక్ వి వచ్చాయి...
అయితే తాజాగా సోనాలిక ట్రాక్టర్స్ కంపెనీ దేశంలోనే తొలి ఎలక్ట్రిక్ ట్రాక్టర్‌ను మార్కెట్లోకి తెచ్చింది. టైగర్ పేరుతో అందిస్తున్న ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ ధర రూ.5.99 లక్షలు(ఎక్స్ షోరూమ్) అని సోనాలిక ట్రాక్టర్స్ తెలిపింది. ఈ ట్రాక్టర్‌ను 25.5 కేడబ్ల్యూ నేచురల్ కూలింగ్ కాంపాక్ట్ బ్యాటరీతో రూపొందించామని, నిర్వహణ వ్యయాలు చాలా తక్కువగా (డీజిల్ ట్రాక్టర్ల వ్యయాలతో పోల్చితే నాలుగో వంతు)ఉంటాయని సోనాలిక గ్రూప్ ఈడీ రామన్ మిట్టల్ తెలిపారు..
ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ గరిష్ట వేగం గంటకు 24.93 కి.మీ. అని, ఒక్కసారి బ్యాటరీని చార్జింగ్ చేస్తే ఎనిమిది గంటల పాటు ఈ ట్రాక్టర్ పనిచేస్తుందని(రెండు టన్నుల ట్రాలీతో) మిట్టల్ వివరించారు. నాలుగు గంటల్లోనే పూర్తిగా చార్జింగ్ చేసే ఫాస్ట్ చార్జింగ్ సిస్టమ్‌ను కూడా ఆఫర్ చేస్తున్నామని పేర్కొన్నారు.