ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తిరుమల పర్యటనలో స్వల్ప మార్పులు
By: chandrasekar Wed, 23 Sept 2020 10:37 AM
తిరుమలలో నిర్వహిస్తున్న
బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి హాజరుకానున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్
తిరుమల పర్యటనలో స్వల్ప మార్పులు జరిగాయి. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో
భాగంగా బుధవారం ముఖ్యమంత్రి జగన్ శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
ముఖ్యమంత్రి జగన్ తిరుమల పర్యటనకు మార్పులు జరిగాయి. బుధవారం మధ్యాహ్నం ఒంటిగంటకు ఢిల్లీ నుంచి
నేరుగా రేణిగుంట ఎయిర్ పోర్టుకు ముఖ్యమంత్రి జగన్ చేరుకుంటారు. రోడ్డు మార్గాన
తిరుమలకు ఆయన చేరుకుంటారు. పద్మావతి అతిథి గృహంలో బస చేస్తారు. అనంతరం సాయంత్రం 5.27కి
అన్నమయ్య భవన్ నుంచి ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం జగన్ పాల్గొంటారు.
ముఖ్యమంత్రి జగన్
బుధవారం సాయంత్రం 6.15కి బేడి ఆంజనేయస్వామి ఆలయం నుంచి ఊరేగింపుగా శ్రీవారి
ఆలయానికి చేరుకుని శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. రాత్రి 7.30కి
శ్రీవారి గరుడ సేవలో పాల్గొంటారు. 24న ఉదయం 6.15 గంటలకు శ్రీవారిని మరోసారి జగన్ దర్శించుకొంటారు. 24న ఉదయం
7 నుంచి
8 వరకు
సుందరకాండ పఠనంలో పాల్గొంటారు. అనంతరం ఉదయం 8.10కి కర్నాటక చౌల్ట్రీ శంకుస్థాపన కార్యక్రమంలో
ముఖ్యమంత్రి జగన్ పాల్గొంటారు. అదే రోజు రాత్రి 10.20కి రేణిగుంట నుంచి
గన్నవరం తిరుగు ప్రయాణం అవుతారు.
ప్రతి ఏటా తిరుమల
బ్రహ్మోత్సవాల మొదటిరోజు రాష్ట్రప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు
సమర్పించడం ఆనవాయితీ. అయితే ఈ ఏడాది కొవిడ్-19 నేపథ్యంలో బ్రహ్మోత్సవాలను ఏకాంతంగానే నిర్వహించాలని
తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. ఈ క్రమంలో భక్తులరద్దీ లేని కారణంగా
పూర్వసంప్రదాయాన్ని పాటిస్తూ గరుడవాహనం జరిగే 23వ తేదీనే ముఖ్యమంత్రి జగన్ పట్టు వస్త్రాలు
సమర్పించనున్నారు. ఇందుకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు అధికారులు
తెలిపారు.