కరోనా నుంచి కోలుకున్న బాధితుల్లో చర్మ సంబంధిత సమస్యలు
By: chandrasekar Tue, 08 Dec 2020 08:38 AM
కరోనా వైరస్ సోకడంవల్ల
శ్వాస సంబంధ సమస్యలతో ఇబ్బందులను ఎదుర్కొంటారు. దీని బారి నుండి కోలుకున్నతరువాత
కూడా బాధితుల్లో చర్మ సంబంధిత సమస్యలు తలెత్తుతున్నట్లు పరిశోధనల్లో
వెల్లడవుతున్నాయి. కరోనా వైరస్ సోకినప్పుడే కాదు, రికవరీ తర్వాత కూడా
కొంతమంది బాధితులు రకరకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. తాజాగా
నిర్వహించిన ఓ స్టడీలో ఈ వైరస్ వల్ల కలిగిన ఇన్ఫెక్షన్ నుంచి కోలుకున్న
బాధితుల్లో చాలామందికి చర్మ సంబంధిత సమస్యలు ఏర్పడినట్లు తెలుస్తుంది. పరిశోధకులు
మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్ (MGH)లో నిర్వమించిన కీలక పరిశోధనల వివరాలను 29వ
కాంగ్రెస్ ఆఫ్ ది యూరోపియన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ అండ్ వెనెరియాలజీలో
వెల్లడించారు. కోవిడ్-19 వల్ల బాధితులు ఎదుర్కొంటున్న తాజా సమస్యల గురించి
ఇందులో పేర్కొన్నారు. వైరస్ నుంచి కోలుకున్న బాధితులు ‘లాంగ్ హాలర్స్’ అనే చర్మ
సమస్యను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. కరోనా నుండి బయటపడితే మరొక సమస్య ఎదురైనట్లు
పరిశోధనల్లో తెలుస్తుంది.
ఇందుకోసం ప్రత్యేకంగా
నిర్వహించిన పరిశోధనల్లో ఈ వివరాలు అందినట్లు తెలిపారు. ప్రస్తుతం ఇంటర్నేషనల్
లీగ్ ఆఫ్ డెర్మాటలజికల్ సొసైటీస్ అండ్ అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీతో కలిసి ఈ
ఏడాది జూన్ నుంచి ఆగస్టు నెలల మధ్య ఈ పరిశోధనలు జరిపారు. ఈ సందర్భంగా 60
రోజులు కంటే ఎక్కువగా కరోనా వైరస్‌తో పోరాడిన బాధితుల్లోనే ఈ చర్మ సమస్యలు
కనిపించినట్లు తెలిపారు. ప్రపంచంలోని 39 దేశాల్లో వెయ్యి కేసులను పరిశీలించగా 224 మందిలో ఈ సమస్య ఉన్నట్లు అనుమానం కలిగిందని, సుమారు
90
మందికి ఈ సమస్య ఉన్నట్లు ల్యాబరేటరీ పరీక్షల్లో నిర్ధరణ జరిగిందని తెలిపారు. కరోనా
వైరస్ సోకిన కొంతమంది రోగుల్లో చర్మ సమస్యలు కూడా తలెత్తాయని, రికవరీ
తర్వాత కూడా అవి కొనసాగాయన్నారు. శరీరంపై దద్దర్లు కనిపించాయన్నారు. వాస్తవానికి
కోవిడ్-19 సోకిన
బాధితులు 20 రోజుల్లోనే కోలుకుంటారు. అయితే, కొంతమంది
బాధితుల్లో ‘లాంగ్ హాలర్స్’ సమస్య సుమారు 70 రోజులు వరకు కొనసాగిందని తెలిపారు. కొందరికి కాళ్లు, చేతుల
వాచాయని ఈ సమస్యను ‘కోవిడ్-టాయ్స్’గా పరిగణమించామని తెలిపారు. కరోనా సోకిన 15
రోజుల్లోనే ఈ లక్షణం వారిలో కనిపించిందని, రికవరీ తర్వాత కూడా కొనసాగిందన్నారు. ఇలా కరోనా వల్ల
వివిధ రకాలుగా బాధితులు ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు.