వివాహానికి వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి
By: chandrasekar Fri, 30 Oct 2020 2:06 PM
తూర్పుగోదావరి జిల్లాలో
ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గోకవరం మండలం తంటికొండ కళ్యాణ వేంకటేశ్వరస్వామి
ఆలయం దగ్గర పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ట్రక్ వ్యాన్ అదుపుతప్పి కొండపై నుంచి
పడిపోయింది.
ఈ ఘటనలో ఆరుగురు
చనిపోయారు.. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్ని రాజమండ్రి, గోకవరం
ఆస్పత్రులకు తరలించారు.. వివాహానికి హాజరై తిరిగి వెళుతుండగా ప్రమాదం జరిగింది.
ప్రమాదం గురించి సమాచారం
అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు
చేపట్టారు. బాధితులు మృతులు గోకవరం మండలం ఠాకుర్‌పాలెంకు చెందిన వారిగా
గుర్తించారు.
ఈ ప్రమాదం బ్రేక్ ఫెయిల్
కావడం వల్లే జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాదంపై కేసు నమోదు
చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.