టీమిండియా 36 పరుగులకు ఆల్ అవుట్ అయినందుకు సంతోషంగా ఉంది.. అక్తర్
By: Sankar Mon, 21 Dec 2020 6:46 PM
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్ లో టీం ఇండియా కేవలం 36 పరుగులకే ఆల్ అవుట్ అయి ఘోరపరాభవం మూటకట్టుకున్న విషయం తెలిసిందే..అయితే తాజాగా ఈ ఓటమిపై పాకిస్తాన్ మాజీ బౌలర్ అక్తర్ స్పందించాడు...
36 పరుగులకే ఆలౌట్! ఘోరమైన ప్రదర్శన ఇది. అయితే ఒక్క విషయంలో మాత్రం నాకు సంతోషంగా ఉంది. ఎట్టకేలకు వాళ్లు మా రికార్డును బ్రేక్ చేశారు. అయినా ఆటలో ఇవన్నీ సహజం. ఇలాంటి ప్రదర్శన కారణంగా బాణాల్లా దూసుకువచ్చే విమర్శలను భరించేందుకు సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు మీ వంతు. మొత్తానికి ఇదొక బ్యాడ్ న్యూస్’’ అని రావల్సిండి ఎక్స్‌ప్రెస్ అక్తర్ చెప్పుకొచ్చాడు.
అయితే అక్తర్ సంతోషపడటానికి కారణం పాకిస్తాన్ కంటే టీమిండియా అత్యల్ప టెస్ట్ స్కోర్ నమోదు చేయడం .. పాక్ విషయానికొస్తే.. 2013లో జోహన్నస్‌బర్గ్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో అత్యల్ప స్కోరు నమోదు చేసింది. కేవలం 49 పరుగులకే ఇన్నింగ్స్ ముగించి విమర్శలపాలైంది.