శర్వానంద్ మళ్లీ షూటింగ్ లో
By: chandrasekar Fri, 02 Oct 2020 4:07 PM
కరోనా మహమ్మారి ప్రభావంతో
6 నెలలుగా
షూటింగ్స్ కు బ్రేక్ పడ్డ సంగతి తెలిసిందే. కరోనా కారణంగా నిలిచిపోయిన షూటింగ్స్
అన్ లాక్ 5.0 అమలవుతుండటంతో మెల్లమెల్లగా ప్రారంభం అవుతున్నాయి.
తాజాగా టాలీవుడ్ యువ నటుడు
శర్వానంద్ మళ్లీ షూటింగ్ లో చేరిపోయాడు. శ్రీకార్తీక్ డైరెక్షన్ లో బై లింగ్యువల్
ప్రాజెక్టుగా వస్తున్న చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు శర్వానంద్. 8 నెలల
తర్వాత మళ్లీ షూట్ లో జాయిన్ అయినట్టు ట్వీట్ చేశాడు శర్వా. ఈ మూవీ చివరి
షెడ్యూల్ షూటింగ్ చెన్నై లో మొదలైంది.
సెట్స్ లో మాస్క్
పెట్టుకున్న శర్వాకు డైరెక్టర్ శ్రీకార్తీక్ సూచనలిస్తున్న ఫొటో ఇపుడు
నెట్టింట్లో షికార్లు చేస్తోంది. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ బ్యానర్ పై
నిర్మిస్తున్న ఈ చిత్రంలో రీతూవర్మ హీరోయిన్ గా నటిస్తోంది. అక్కినేని అమల కీలక
పాత్రలో నటిస్తోంది.