ఉమేష్ స్థానం కోసం ఇద్దరు బౌలర్ల మధ్య గట్టి పోటీ
By: Sankar Thu, 31 Dec 2020 11:33 PM
గాయం కారణంగా ఆస్ట్రేలియాతో చివరి రెండు టెస్టులకు దూరమైన పేసర్ ఉమేశ్ యాదవ్ స్థానం కోసం ఇద్దరు బౌలర్లు పోటీపడుతున్నారు.
వచ్చే వారం ప్రారంభమయ్యే సిడ్నీ టెస్టుకు భారత తుది జట్టులో చోటు కోసం బౌలర్లు టీ నటరాజన్, శార్దుల్ ఠాకూర్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నటరాజన్‌కు ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో తగినంత అనుభవం లేకపోవడంతో శార్దుల్‌ను ఎంపిక చేసేఅవకాశాలున్నట్లు జట్టు వర్గాలు తెలిపాయి. శార్దుల్ వైపే టీమ్‌మేనేజ్‌మెంట్ మొగ్గుచూపుతోందని తెలిసింది.
ఇప్పటికే గాయం నుంచి కోలుకున్న స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ సిడ్నీ లో జరిగే టెస్టుకో అందుబాటులోకి వచ్చాడు..అయితే ఎవరి స్థానంలో రోహిత్ తుది జట్టులోకి వస్తాడో తెలియాల్సి ఉంది..
Tags :