ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఎస్ఈసీ దూకుడు...
By: chandrasekar Wed, 25 Nov 2020 5:54 PM
ఫిబ్రవరిలో ఎన్నికలు
నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఆ దిశగా ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఎన్నికల
నిర్వహణకు సంబంధించి హైకోర్టు తీర్పు కాపీని జతచేసి సీఎస్ నీలం సాహ్నీకి ఎస్ఈసీ
నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాశారు. తాజాగా ఓటర్ల జాబితా అందించాలని కేంద్ర
ఎన్నికల కమిషన్, ఏపీ సీఈవో విజయానంద్‌కు కూడా లేఖ రాశారు. 2021
జనవరిలో ఓటర్ల జాబితాను అందివ్వాలని కేంద్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర
సీఈవో విజయానంద్‌కు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోరారు. జనవరి మాసాంతంలోపు ఓటర్ల
జాబితాను అన్ని జిల్లాల్లో ప్రచురించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని పంచాయతీరాజ్
కమిషనర్‌ను ఇందుకోసం సమన్వయం చేసుకోవాలని నిమ్మగడ్డ వివరించారు. ఎన్నికలు
నిర్వహించకూడదని ప్రభుత్వం కోర్టుకు వెళ్లినా కర్ణాటక, కేరళ, రాజస్థాన్
రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు వివరాలను
ప్రస్తావిస్తున్నారు.
సీఎస్‌కు నిమ్మగడ్డ రమేష్
కుమార్ ఇప్పటికే లేఖ రాశారు. కలెక్టర్లతో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ కూడా
నిర్వహించడానికి సీఎస్ అంగీకరించలేదు. రెండుసార్లు వీడియో కాన్ఫరెన్స్ రద్దైంది.
ఎన్నికల కమిషనర్‌కు సహకరించకపోతే ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతుందని హైకోర్టు
గత ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఆ ఉత్తర్వుల కాపీని జతచేసి సీఎస్‌కు నిమ్మగడ్డ
మరో లేఖ రాశారు.