ఖాళీ స్టేడియాల్లో ఆడటం భారత ఆటగాళ్లకు కష్టమే..స్కాట్ స్ట్రైరిస్
By: Sankar Wed, 09 Sept 2020 12:36 PM
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఐపీఎల్ 2020 సీజన్‌ని ఖాళీ స్టేడియాల్లో నిర్వహించబోతుండటంతో భారత క్రికెటర్లు అభిమానుల నుంచి లభించే ఎనర్జీని మిస్ అవుతారని న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ స్కాట్ స్ట్రైరిస్ అభిప్రాయపడ్డాడు. విరాట్ కోహ్లీ గత పదేళ్ల నుంచి క్రికెట్ ఆడుతున్నాడు.
అతనిలానే చాలా మంది భారత క్రికెటర్లు సుదీర్ఘకాలంగా మ్యాచ్‌లు ఆడుతున్నారు. వారంతా.. కిక్కిరిసిన స్టేడియాల్లో మ్యాచ్‌లు ఆడటాన్ని అలవాటు చేసుకున్నారు. కానీ.. ఇప్పుడు ఖాళీ స్టేడియాల్లో గేమ్ ఆడటమంటే వారికి అభిమానుల నుంచి వచ్చే ఎనర్జీ మిస్ అవుతుంది. కానీ.. విదేశీ క్రికెటర్లకి ఆ సమస్య లేదు. ఎందుకంటే.. చాలా దేశాల క్రికెటర్లకి తక్కువ మంది అభిమానుల ముందు మ్యాచ్‌లు ఆడటం అలవాటే’’ అని స్ట్రైరిస్ చెప్పుకొచ్చాడు.
యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ జరగనుండగా.. మొత్తం 53 రోజుల విండోలో 60 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో 10 డబుల్ హెడర్ మ్యాచ్‌లు. 2008 నుంచి ఐపీఎల్ జరుగుతుండగా.. ఖాళీ స్టేడియాల్లో టోర్నీ నిర్వహిస్తుండటం ఇదే తొలిసారి.