Advertisement

  • సైయెంట్‌ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు...15 శాతం తగ్గిన లాభం

సైయెంట్‌ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు...15 శాతం తగ్గిన లాభం

By: chandrasekar Fri, 16 Oct 2020 6:55 PM

సైయెంట్‌ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు...15 శాతం తగ్గిన లాభం


హైదరాబాద్‌ కేంద్రస్థానంగా ఐటీ సేవలు అందిస్తున్న సైయెంట్‌ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను సంస్థ రూ.83.90 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని పొందింది.

గతేడాది ఇదే సమయంలో వచ్చిన రూ.98.50 కోట్ల లాభంతో పోలిస్తే 14.8 శాతం తగ్గినట్లు సంస్థ బీఎస్‌ఈకి సమాచారం ఇచ్చింది. సమీక్ష కాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 13.4 శాతం తగ్గి రూ.1,003.30 కోట్లకు పరిమితమైంది.

గతేడాది ఇది రూ.1,158.90 కోట్లుగా ఉన్నది. మొదటి త్రైమాసికంలో నమోదైన రూ.81.40 కోట్ల లాభంతో పోలిస్తే మూడు శాతం పెరుగగా, రూ.991.70 కోట్ల ఆదాయంతో పోలిస్తే 1.2 శాతం పెరిగింది. ఆపరేటింగ్‌ ఆదాయం అధికమవడం ఇందుకు దోహదం చేశాయని కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈవో కృష్ణ బొడనపు పేర్కొన్నారు.


Tags :

Advertisement