- హోమ్›
- జాతకం ఓర జోతిష్యం›
- నెగటివ్ ఎనర్జీని తగ్గించి పాజిటివ్ ఎనర్జీని తీసుకొచ్చే సత్తా ఉన్న ఉప్పు
నెగటివ్ ఎనర్జీని తగ్గించి పాజిటివ్ ఎనర్జీని తీసుకొచ్చే సత్తా ఉన్న ఉప్పు
By: chandrasekar Tue, 01 Sept 2020 1:40 PM
సాధారణంగా ఉప్పు లేకుండా ఆహార౦ తినడం చాలా కష్టమైన విషయం. వంటల్లో ఉప్పు లేకపోతే రుచే లేదు. ఉప్పు రుచులకు మాత్రం పరిమితం కాలేదు. నెగటివ్ ఎనర్జీని తొలగించే శక్తీ ఉప్పు లో ఉంది. అందుకే మన పెద్దలు ద్రిష్టి తీయడానికి ఉప్పును ఉపయోగిస్తారు. చెడును పోగొట్టడమే కాకుండా మంచి పాజిటివ్ ఎనర్జీని తీసుకొచ్చే సత్తా ఉప్పుకి ఉంది.
ఇంకా చెప్పాలంటే వాస్తు దోషాలను పోగొట్టడంలో ఉప్పుకి వేరేది సాటిలేదు ఇకమీదట ఏది రాదూ. మరి ఈ ఉప్పును ఎలా వాడాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే వారికి ఉప్పు ఎంతో ఉపశమనాన్నిస్తుంది.
అయితే చేయాల్సిందల్లా ఒకటే ఒక విషయం.. రాగి పాత్రలో ఉప్పును తీసుకుని బెడ్‌రూమ్‌లో పెట్టాలి. అలాగే ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నాయి అనుకుంటే గ్లాస్ నిండా ఉప్పుని తీసుకొని బాత్‌రూంలో పెట్టాలి. ఇలా చేస్తే ఇంట్లోని అన్ని ఆటంకాలను తొలిగించి కుటుంబ సభ్యులను ఆనందంగా ఉంచేలా చేస్తుంది. ఈ విధంగా చేయడం వల్ల కుటుంబంలో అందరికి మంచి జరుగుతుందని చెబుతున్నారు వాస్తు నిపుణులు.