స్నేహితుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన సచిన్ టెండూల్కర్
By: chandrasekar Mon, 03 Aug 2020 10:00 AM
ప్రపంచంలో స్నేహితులు
లేని వారు ఎవ్వరు వుండరు. అలంటి స్నేహితుల కోసం ఒక ప్రత్యేకమైన దినంగా
గుర్తించబడిందే 'స్నేహితుల దినోత్సవం'. అమ్మప్రేమ తర్వాత అంతే
గొప్ప ప్రేమ కలిగిందే స్నేహం. మన శ్రేయస్సు కోరేవారే నిజమైన స్నేహితులు. కష్టమైనా, సంతోషానైనా
కలిసి పంచుకోవడమే సిసలైన స్నేహానికి నిర్వచనం. ఆదివారం స్నేహితుల దినోత్సవం
సందర్భంగా భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తన స్నేహితులకు శుభాకాంక్షలు
చెప్పాడు. ట్విట్టర్లో తన బాల్య మిత్రులతో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో
పంచుకున్నాడు.
స్నేహితుల మధ్య స్నేహబంధం
అనేది స్టేడియంలోని ఫ్లడ్ లైట్ల లాంటిది. ఓ మూల నుంచి మన విజయాలను ఆస్వాధిస్తాయి.
వెలుగు దూరమై సూర్యుడు అస్తమిస్తున్న వేళ వాటంతటవే వెలిగి చీకటిని తొలగించి
వెలుగునిస్తాయి. నాకు ప్రతి రోజు స్నేహితుల దినోత్సవమే అంటూ ఫొటోకు ట్యాగ్ లైన్
జోడించారు. ఇదిలా ఉండగా ముంబై ఇండియన్స్. చెన్నై సూపర్ కింగ్స్ కూడా స్నేహితుల
దినోత్సవం సందర్భంగ ట్విట్లు చేశాయి. ముంబై ఇండియన్స్ తమ ఆటగాళ్ల ఫొటోను పంచుకొని
కుటుంబంగా మారిన మిత్రులకు ఫ్రెండ్ షిప్ డే శుభాకాంక్షలు అని పేర్కొంది. చెన్నై
జట్టు ధోని, రైనా ఫొటోలను పంచుకొని వాళ్లిద్దరూ మంచి స్నేహితులు, సీఎస్కేను
తిరుగులేని స్థితిలో నడుపుతున్నారని పేర్కొంది.