కరోనాను జయించిన గాన గంధర్వుడు ఎస్పీ బాలు
By: Sankar Mon, 07 Sept 2020 5:37 PM
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే . చెన్నై ఎంజిఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలు గత కొన్ని రోజులుగా వెంటిలేటర్‌పైనే ఉన్నారు. తాజాగా బాలుకు కరోనా నెగిటివ్ అని నిర్దారణ అయ్యింది.
బాలు కరోనా బారిన పడిన దగ్గరనుంచి ఆయన కోలుకోవాలని సెలబ్రెటీలు , సంగీత ప్రేమికులు దేవుడిని ప్రార్దిస్తూనే ఉన్నారు. ఇదిలా ఉండగా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అవ్వడంతో ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆగస్టు 5న చెన్నైలోని ఎంజీఎం హెల్త్‌కేర్ ఆస్పత్రిలో చేరారు. అప్పటినుంచి ఆయనకు ఐసీయూలో వెంటిలేటర్, ఎక్మో సహాయంతో చికిత్సను అందజేస్తున్నారు.
బాలు ఆరోగ్యంపై ఆయన తనయుడు ప్రతిరోజు సమాచారం అందిస్తూ ఉన్నారు. ఇక బాలుకు నెగిటివ్ రావడంతో సంగీత ప్రేమికులు , ఆయనను అభిమానించేవారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఆయన డిశ్చార్జ్ అవ్వాలని ప్రార్ధనలు చేస్తున్నారు.